నేటి సాక్షి, పరిగి (సురేష్ మోత్కూర్) హైదరాబాద్ పట్టణం BRS భవన్ లో ప్రభుత్వం G.O నెంబర్ 17 ని రద్దు చేయాలనీ SC, ST, BC, మైనారిటీల కాంట్రాక్టర్స్ లకు మద్దతుగా ముఖ్యతిధులుగా విచ్చేసిన BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి / సుప్రీమ్ స్వేరో Dr RS ప్రవీణ్ కుమార్ సార్ పాల్గొనడం జరిగింది .ఆయన మాట్లాడుతూ…. ప్రభుత్వం తీసుకువచ్చిన G.O 17 ద్వారా SC, ST, BC, మొయినార్టీ కాంట్రాక్టర్స్ కడుపు కొట్టి కోట్ల రూపాయలు ప్రభుత్వం మంత్రుల బినామీలకు ఇచ్చే భారీ కుట్ర జరుగుతుంది అన్ని, 200/- కోట్ల కుంబకోణం జరుగుతుంది అన్ని ఇలాంటి వైఖరిని ప్రభుత్వం మార్చుకోవాలని రేవంత్ రెడ్డి ఇచ్చిన డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలనీ ప్రవీణ్ కుమార్ సార్ గారు మాట్లాడటం జరిగింది.అదే విదంగా G.O 17 ను రద్దు చేయాలనీ SC, ST, BC, మొయినార్టీ కాంట్రాక్టర్స్ మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం G.O 17 ను రద్దు చేయకపోతే తెలంగాణ రాష్ట్రమంత పెద్ద ఎత్తున్న ఉద్యమం చేస్తామని కాంట్రాకర్స్ హెచ్చరించారు.ఇందులో భాగంగా SC, ST, BC, మొయినార్టీ అసోసియేషన్స్ కమిటీ మెంబెర్స్ మరియు వివిధ సంక్షేమ హాస్టల్లో పని చేస్తున్న టెండర్ దారులు పాల్గొనడం జరిగింది.





