Friday, May 8, 2026

రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలుమే 19 వరకు దరఖాస్తులు

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి 8పుంగనూరు డివిజన్ పరిధిలోని పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సోదం మండలాల రైతులకు SMAM పథకం కింద వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీపై అందించనున్నట్లు సహాయ వ్యవసాయ సంచాలకులు శివకుమార్ తెలిపారు. 2025-26 సంవత్సరానికి రూ.31.07 లక్షల సబ్సిడీ నిధులు కేటాయించారని పేర్కొన్నారు.ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లు, కోత నూర్పిడి యంత్రాలు, విత్తే, నాటే యంత్రాలు తదితర పరికరాలపై ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు మరియు మహిళలకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు.ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే సబ్సిడీ వర్తిస్తుందని, 2024-25లో లబ్ధి పొందిన వారు అర్హులు కాదన్నారు. ట్రాక్టర్ ఆధారిత పరికరాలకు ట్రాక్టర్ ఆర్సీ కాపీ తప్పనిసరిగా సమర్పించాలన్నారు.రైతులు మే 19లోపు రైతు సేవా కేంద్రాలు లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికను లాటరీ విధానంలో నిర్వహించి, ఎంపికైన వారికి మొబైల్ సందేశాల ద్వారా సమాచారం అందజేస్తామని తెలిపారు.మే 23 నుంచి 25 వరకు లాటరీ ప్రక్రియ నిర్వహించి, ఎంపికైన రైతులు మే 26 నుంచి జూన్ 9లోపు తమ వాటా మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. అనంతరం జూన్ 26లోపు యంత్రాలను సరఫరా చేస్తారని వెల్లడించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News