నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్ రాజంపేట గ్రామపంచాయతీలో ఈరోజు “ఎస్.ఐ.ఆర్” (SIR) అవగాహన కార్యక్రమాన్ని బి.ఎల్.ఓ (BLO) మరియు రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గులాం జావిద్ గారు ప్రత్యేకంగా పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా గులాం జావిద్ గారు స్వయంగా ప్రజల మధ్యకు వెళ్లి, ఎస్.ఐ.ఆర్ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రభుత్వ సేవలు మరియు సంబంధిత విధానాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అధికారులకు సమన్వయంతో సహకరించారు.ప్రజా ప్రతినిధిగా ప్రతి ఇంటికీ సమాచారం చేరేలా తీసుకున్న చొరవను స్థానిక ప్రజలు మరియు అధికారులు అభినందించారు. కార్యక్రమం విజయవంతం కావడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు అధికారులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.





