నేటి సాక్షి, చౌడాపూర్.(సురేష్ మోత్కూర్.)కొత్తపల్లి క్లస్టర్లో పి ఏ సి ఎస్ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రానిచౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రారంభించారు. పలువురు మాట్లాడుతూ…. రైతులు పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు కొనుగోలు కేంద్రలోనే అమ్ముకోవాలి అని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర దొడ్డు రకం వడ్లకు 2389/-రూపాయలు సన్న వడ్లకు 500 వందల రూపాయల బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యకులు చంద్ర శేఖర్, మాజీ మండల అధ్యక్షుడు ఏల్పాటి అశోక్ కుమార్.గ్రామ సర్పంచ్ రజితనార్సిములు,ఉప సర్పంచ్ శ్రీనివాసులు నాయకులు శేశిధర్ రెడ్డి, మనంకొండ మాజి సర్పంచ్ చెన్నయ్య వార్డు సభ్యులు కురమూర్తి చెన్నయ్య కృష్ణయ్య ఆంజనేయులునీర్ సాబ్, తండా సర్పంచ్ నారాయణ కన్మానకాల సర్పంచ్ కృష్ణవేణి రాజు,చౌడాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులుగోపాల్ సహకార సంఘ సిబ్బంది మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.





