*ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రజలకు తెలుపుతాం** ప్రతిపక్షాల విమర్శలకు దీటైన సమాధానం ఇస్తాం * తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ గ్లోరి యానెట్నేటి సాక్షి,బాపట్ల జిల్లా ప్రతినిధి బాపట్ల జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి బాపట్ల జిల్లా కమిటీలో స్థానము కల్పించినందుకు శుక్రవారం గౌరవ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ ని కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ మన పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని తెలిపారు.సరైన సమయంలో సముచిత స్థానం కల్పించబడుతుందని తెలిపారు. మీకు ఈ పదవితో మీ బాధ్యత మరింత పెరిగిందని మీరు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి రావటం మీరు పార్టీ కోసం చేసిన కృషి కష్టంకి ఫలితమని భవిష్యత్తులో పార్టీ కోసం పని చేస్తూ మరెన్నో మంచి పదవులు అలంకరించాలని ఈ సందర్భంగా ఆశీర్వదించారు.ఈ సందర్భంగా డాక్టర్ గ్లోరీ మాట్లాడుతూ సామాన్య మహిళనైన నన్ను ఆదరించి అభిమానించి ఈ జిల్లా స్థాయి పదవి కి ఎంపిక చేసిన శాసనసభ్యులు గౌరవనీయులు నరేంద్ర వర్మ కి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నియమించిన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు కి రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పల్లా శ్రీనివాసరావు కి గౌరవ శాసనసభ్యులు నరేంద్ర వర్మ గారికి బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరిశ్రీనివాస రెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు గురువర్యులు ఆత్మీయులు శ్రీ లక్కం రాజు వెంకటపతి రాజు గారికి సీనియర్ నాయకులు గౌరవనీయులు కనుమూరి సాంబమూర్తి రాజు కి సహకరించిన కూటమి నాయకులకు తెలుగుదేశం పార్టీ పెద్దలకు నాయకులకు కార్యకర్తలకు అభిమానులు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ పదవితో నాకు బాధ్యత పెరిగిందని తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడతానని బాపట్ల జిల్లాలో పార్టీ ప్రతిష్టతకు అహర్నిశలు శ్రమిస్తానని పార్టీలోని అన్ని క్యాడర్ నాయకులతో కలసి పనిచేస్తానని కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను జిల్లాలోని శాసనసభ్యులు వారితో మాట్లాడి సమస్యలు త్వరితగతిన పరిష్కరించుటకు కృషి చేస్తానని ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను జిల్లా ప్రజలలోనికి తీసుకొని పోతూ ప్రతిపక్షాలు విమర్శలకు తీటైన సమాధానం ఇస్తామని ఈ సందర్భంగా తెలుపుతూ ఇప్పటివరకు నన్ను ఆదరించిన విధంగా ఇకనుంచి కూడా జిల్లా స్థాయి నాయకులు, పెద్దలు కార్యకర్తలు, అభిమానులు అందరూ నన్ను ఆదరించాలని అభిమానించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..

