Friday, February 13, 2026

అశోక్​నగర్​లో ఘనంగా గణతంత్ర దినోత్సవం

నేటి సాక్షి, కరీంనగర్​: 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కరీంనగర్​లోని 54వ డివిజన్​ అశోక్​నగర్​లో టీడీపీ కరీంనగర్​ పార్లమెంట్ ​ప్రధాన కార్యదర్శి తీగుట్ల రమేష్ ​కుమార్​ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. డివిజన్​ ప్రధాన కూడలి వద్ద జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. అంతకు ముందు మహనీయుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, తొవిటి శంకరయ్య, జీవీ ఉమారాణి–రమణ, నాంపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్​ నాయకులు ఇమ్రాన్, ఎంఐఎం నాయకుడు ఆసిమ్, బీఆర్ఎస్​ నాయకుడు ఎండీ యూసుఫ్, డివిజన్​ యువకులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News