Friday, May 1, 2026

కులగణన తీర్మానం చరిత్రాత్మకం

  • వాల్మీకులను ఎస్టి జాబితాలో పునరుద్ధరించాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలి
  • రాష్ట్రంలో కొత్తగా సమీకృత గురుకులాలకు మహర్షి వాల్మీకి పేరు పెట్టాలి
  • హైదరాబాద్ ట్యాంక్ బండి పై వాల్మీకి విగ్రహం పెట్టాలి
  • మండ్ల దేవన్ననాయుడు వాల్మీకి సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా :
రాష్ట్రంలో బీసీ కులాల గణన చేపట్టాలని అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించడం చరిత్రాత్మక ఘట్టం అని వాల్మీకి సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ మండ్ల దేవన్న నాయుడు అన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా బీసీ వర్గాలకు సరైన న్యాయం జరగడం లేదని, ఇందుకు బీసీ కులగణన . బీసీలు సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ రంగాల్లో వెనకబడ్డారని,గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం సామాజిక న్యాయం దిశగా పనిచేస్తుందని అన్నారు అలాగే బిసి కులగణన ఆధారంగా వాల్మీకి బోయలను ఎస్టిజాబితాలో పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్రంలో వాల్మీకిల జనాభా ఐదు లక్షల 50 వేల జనాభా గలదు వీరిలో నూటికి విద్యావంతులు 2% శాతం ఉద్యోగులు 1% శాతం మిగతా నోటికి 97% బోయలు సామా జికంగా కర్షకులుగా బతుకుతున్నారు భారత రాజ్యాంగం చట్టం 1951 జీ. ఓ. ఎం. 1527/1951 ప్రకారం వాల్మీకి బోధిలను హిస్టరీగా గుర్తించింది 1968 వరకు బోయలు ఎస్టీలుగానే ఉన్నాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో మినహా భారతదేశంలోని 94% రాష్ట్రాలలో వాల్మీకి బోయలను ఎస్సీ లేదా ఎస్టీ జాబితాలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బీసీ జాబితాలో ఉన్నారన్నారు అన్ని రంగాలలో వెనుకబడిన వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చి వారి అభివృద్ధికి ప్రోత్సాహం అందించాలని కోరారు గత బీ ఆర్ఎస్ ప్రభుత్వం తూతూ మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసి ఒకసారి మైనార్టీ బిల్లు వాల్మీకుల బిల్లు కలిపి మరోసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మాలి వర్గానికి కూడా ఎస్టి జాబితాలో కలపాలని మరోసారి కేంద్రానికి పంపింది బీ ఆర్ఎస్ బిజెపి మధ్యలో వాల్మీకులు బలైపోయారు ఆవేదనపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వాల్మీకులపై తన అభిమానం చాటుతూ వనపర్తి పట్టణంలో వివేకానంద చౌరస్తాలో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ చేసి గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టి వాల్మీకి బోయ సామాజిక వర్గానికి అండగా నిలిచాడని మండ్ల దేవన్న నాయుడు ఎమ్మెల్యేగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వాల్మీకి బోయలపై దయవుంచి సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి పెంచి ఎస్టీ జాబితాలో పునరుద్ధరించాలని దేవన్న నాయుడు ప్రభుత్వాన్ని కోరారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News