నేటి సాక్షి వికారాబాద్ :వికారాబాద్ జిల్లా ధారూర్ మండల పరిధిలో నీ నాగుసన్ పల్లి, తరిగోపుల గ్రామాల్లోని మొక్క జొన్న ధాన్యాన్ని,అల్లీపూర్ గ్రామ పొలాల్లోని జొన్న కల్లాలను పరిశీలించి, రైతులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి వికారాబాద్ జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ….మట్టిని నమ్ముకుని బతికే రైతన్నకు ఎనలేని భరోసా ఇచ్చిన “రైతు బాంధవుడు” కేసీఆర్కెసిఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం లో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.గత రెండు సంవత్సరాలుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల బాధ వినడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. రైతు సోదరుడిగా చెప్పుకునే రేవంత్ రెడ్డి మొదట రైతుల కన్నీళ్లు తుడవాలని కోరుతున్నాం. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో దళారుల చేతుల్లో తీవ్రంగా నష్టపోతున్న రైతులు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది.పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రాష్ట్రంలోని పలు పట్టణాల్లో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేస్తున్న రైతులు.పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్తాన్- భారత్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎంపీ లు సమర్ధించడం కాంగ్రెస్ ఎంపీ లు స్పందించకపోవడం సిగ్గుచేటు.వికారాబాద్ జిల్లాలో సరిపడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యాలని కలెక్టర్ వినతి పత్రం అందించిన ధారూర్ మండల బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు.కలెక్టర్ గారికి వ్యవసాయ అధికారులకు స్వచ్ఛందంగా వినతి పత్రాలు సమర్పించిన రైతులు.చెరువులను నింపి లక్షల ఎకరాల్లో పంటలను కాపాడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు.కెసిఆర్ మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద విష ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.కేసీఆర్ పేరు వింటేనే కాంగ్రెస్ వెన్నులో వణుకు పుడుతోంది.ఈ నెల 20న జగిత్యాల లో కేసీఆర్ గారి భారీ సభను చూసి బయపడిన రేవంత్ రెడ్డి అదే రోజు మేడిగడ్డ డ్రామా కు తెరలేపారు.డైవర్షన్ రాజకీయాలతో పబ్బం గడుపుతున్న కాంగ్రెస్ పార్టీ.రైతుల కష్టాలు గాలికొదిలేసి.. గాలి మోటార్లలో ముఖ్యమంత్రి, మంత్రుల విహారాలు.ఎన్నికల ముందు పెద్ద పెద్ద వరాలు, నేడు కనీస మద్దతు ధరకూ దిక్కులేదు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు విత్తనాలు, ఎరువులు ఇవ్వలేకపోతోంది.రైతులకు ఇప్పటికి పూర్తిగా రుణమాఫీ కాలేదు, రైతుభరోసా ఇవ్వలేదు.అప్పులు తెచ్చి-తిప్పలు పడుతున్న రైతులు.ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక ప్రభుత్వం. గాలి మోటార్లలో తిరుగుతూ ఢిల్లీ పర్యటనలుకు రేవంత్ రెడ్డి పరిమితం అయ్యారు.కొద్ది రోజులుగా ధాన్యం అమ్మడానికి కొనుగోలు కేంద్రాలు లేక పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి.పండించిన పంటను బయట అమ్ముకుని క్వింటాల్ కు వేల రూపాయలు నష్టపోతున్న రైతులు.ఒక్క ధారూర్ మండలం లోనే మొక్కజొన్న జొన్న కలిపి దాదాపు 5000 ఎకరాలుగా ఉంది.ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్‌లో ప్రతి పంటకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్…ఇప్పుడు బోనస్ ఎగ్గొట్టి ఆ మాటను బోగస్ చేసింది. రేవంత్ రెడ్డి రైతుల కష్టాల మీద వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఒక్కసారైనా రివ్యూ చేసారా?వర్ష సూచన, ధాన్యం నిలువ చేస్కునే వసతి లేకపోవడం వంటి కారణాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రైతులు పంట అంత అమ్ముకున్నాక చివర్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఉపయోగం ఉండదు.ఏదో మొక్కుబడిగా చివరి వారంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చెయ్యటం వల్ల ఎవరికి ప్రయోజనం?పండిన ప్రతి గింజనూ మద్దతు ధరకు కొనాల్సిందే. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కొనుగోలును వెంటనే మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని రైతుల పక్షాన బీ ఆర్ ఎస్ పార్టీ తరుపున హెచ్చరిస్తున్నమన్నారు.ఈ కార్యక్రమంలో TSEWIDC మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పటేల్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ నియోజకవర్గ బీ ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు రైతులు పాల్గొన్నారు.





