Saturday, April 18, 2026

*నేషనల్ శిక్ష అవార్డ్స్‌లో ఆక్స్ఫర్డ్ స్కూల్‌కు ప్రథమ స్థానం**అభ్యాస స్కూల్‌కు ద్వితీయ స్థానం*——————————————

నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు )…………………………………….హైదరాబాద్ నగరంలోని ప్రముఖ స్టార్ హోటల్ నోవోటెల్‌ లో నిన్న జరిగిన నేషనల్ లెవల్ శిక్ష అవార్డ్స్ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ స్కూల్, అభ్యాస స్కూల్‌లు విశిష్ట ప్రతిభ కనబర్చాయి.ప్రొపెల్ కరికులం ఇంప్లిమెంటేషన్ విభాగంలో *ఆక్స్ఫర్డ్ స్కూల్ దేశవ్యాప్తంగా ప్రథమ స్థానం సాధించి* , సంస్థ సీఈవో సుమిత్ బాయల్ చేతుల మీదుగా అవార్డును అందుకుంది.అలాగే, పిన్నాకిల్ కరికులం ఇంప్లిమెంటేషన్ విభాగంలో *అభ్యాస స్కూల్ దేశంలోనే ద్వితీయ స్థానం* సాధించి అవార్డును స్వీకరించింది. రెండు విభిన్న కరికులాలలో నేషనల్ స్థాయి అవార్డులు రావడం ప్రత్యేకంగా గుర్తించదగ్గ విషయం. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ భోగ రవి ప్రసాద్, కరస్పాండెంట్ శ్రీదేవి గారు పాల్గొని అవార్డులను స్వీకరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News