నేటి సాక్షి 22 మార్చి పాములపాడు :– పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామంలో ఉన్న రామాలయం కొట్టాల వీధిలో సి.సి.రోడ్డుకు తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి & మాజీ గ్రామ సర్పంచ్ జి.హరి ప్రసాద్ యాదవ్ నాయకులతో కలిసి భూమి పూజ చేసి, పనులను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మిట్టకందాల గ్రామ మాజీ సర్పంచ్ & టిడిపి మండల ప్రధాన కార్యదర్శి జి.హరిప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే గ్రామాలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతాయన్నారు. నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ మాండ్ర.శివానందరెడ్డి, ఎమ్మెల్యే గిత్త.జయసూర్య ల సహకారంతో దాదాపు 45 లక్షల వ్యయంతో, 7 సీ.సీ.రోడ్లను వేయడం జరుగుతుందన్నారు. గ్రామాభివృద్ధిలో అందరితో కలిసి పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి బూత్ ఇన్చార్జి ఎల్.శివరాముడు, నాయకులు ఎల్.సురేష్, దేవరాజు, కే.శీను, సయ్యద్ బాషా, ఎల్.అఖిల్, కృష్ణన్న, తదితరులు పాల్గొనడం జరిగింది.





