నేటిసాక్షి జూన్ 4 (మంచిర్యాల్) శ్రీధర్ దమ్మ
ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించడం కోసం
తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 5న హైదరాబాదులో జరిగే ర్యాలీ, ధర్నా విజయవంతం కోసం గోడపత్రిక మరియు కరపత్రాల ఆవిష్కర బెల్లంపల్లి పట్టణ కేంద్రంలో విడుదల చేయడం జరిగింది
ఈ సందర్భంగా *ప్రగతిశీల యువజన సంఘం PYL తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకుడు కె మనోహర్* మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ ప్రతిష్టతకు కేంద్ర ప్రభుత్వము తన బడ్జెట్లో 10 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వము తన బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించాలన్నారు ప్రస్తుతం కొనసాగుతున్న రెసిడెన్షియల్ స్కూళ్లకే పక్కా భవనాలు, భౌతిక వసతులు కల్పించి ప్రభుత్వం ఆశించిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లను ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ కళాశాలలను వేలాది పాఠశాలలను పాతర వేసే తెలంగాణ పబ్లిక్ స్కూల్ మరియు ఫౌండేషన్ స్కూల్ స్థాపనను మానుకోవాలని అన్ని ప్రభుత్వ పాఠశాలలని సెమి రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని తెలిపారు.అన్ని ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు
విద్యాశాఖ విడుదల చేసిన ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులను తక్షణమే విరమించుకోవాలని, మధ్యాహ్న భోజన పథకంలో అల్పాహారము స్నాక్స్ కు సంబంధించిన విషయంలో ఇస్కాన్ సంస్థకు వందేమాతర ఫౌండేషన్లకు అప్పజెప్పే నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న బోధన ,బోధనేతర సిబ్బంది పోస్టులను మరియు ఎంఈఓ డీఈవో పోస్టులను తక్షణమే భర్తీ చేసి పర్యవేక్షణను పెంచాలన్నారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కి బదులు రాష్ట్రంలోనున్న 17 విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో డిటిఎఫ్ సభ్యుడు సాయికుమార్, శ్రీకాంత్, నరేష్, రమేష్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు*
Telangana
జూన్ 5న హైదరాబాదులో జరిగే తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయండి*
Quick Summary:
జూన్ 5 నా హైదరాబాద్ లో జరిగే తెలంగాణ విద్య పరిరక్షణ కమిటీ....