నేటిసాక్షి, మిర్యాలగూడ : ప్రకృతిని రక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక" పర్యావరణ వారోత్సవాల భాగంగా శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని పట్టణంలో మరియు గ్రామీణ ప్రాంతాల్లోని అటవీ భూముల్లో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని, విస్తృతంగా మొక్కలు నాటారు. పట్టణ పరిధిలోని గ్రంధాలయం ఎదురుగా మున్సిపల్ చైర్మన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్,
అటవీశాఖ అధికారులు మరియు మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే బిఎల్ఆర్ నగర జీవ వైవిధ్యాన్ని పెంచే నీడను, పండ్లను ఇచ్చే మొక్కలను నాటారు. అనంతరం గ్రామీణ ప్రాంత పరిధిలోని రిజర్వ్ ఫారెస్ట్, అవెన్యూ ప్లాంటేషన్ స్థలాలలో స్థానిక ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ, గ్లోబల్ వార్మింగ్ విపత్తు నుండి మానవాళిని కాపాడుకోవడానికి పచ్చదనాన్ని పెంచడం ఒక్కటే మార్గమని తెలియజేశారు. ప్రజా పాలనలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ వారోత్సవాల ద్వారా నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో మొక్కలు నాటుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు , అటవీ శాఖ అధికారులు, పర్యావరణ ప్రేమికులు మరియు కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
ప్రకృతిని రక్షించడం...ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత : ఎమ్మెల్యే బిఎల్ఆర్
Quick Summary:
ప్రకృతిని రక్షించడం...
