నేటి సాక్షి 08జూన్ పాములపాడు:-
పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామం లో ఈనెల-15, 16, 17 వ తేదీలలో జరిగే శ్రీ సీతారామలక్ష్మణ హనుమత్సమేత శిఖర ధ్వజ ప్రతిష్ఠా మహోత్సవానికి రావాలని ఆలయ చైర్మన్ టేకూరి.రామసుబ్బమ్మ ఆహ్వాన పత్రికలను నందికొట్కూరు నియోజవర్గ ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి లకు, అందరూ ప్రజాప్రతినిధులకు, అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు, మీడియా ప్రతినిధులకు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు & హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత, అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు శ్రీ రామాలయ పునర్ ప్రతిష్ట మహోత్సవానికి అందరికీ పేరుపేరునా ఆహ్వానం పలుకుతూ ఏడు సంవత్సరాల నిరీక్షణకు ముగింపు 31/03/2019 తారీఖు నా, స్వర్గీయ టేకూరి గాండ్ల కృష్ణుడు, టేకూరి.రామ సుబ్బమ్మ మరియు కొంత మంది పెద్దల సమక్షంలో పునర్నిర్మాణానికి పునాదులు వేశారు.
98 సంవత్సరాల చరిత్రకు నూతన అధ్యాయం ప్రారంభం అవుతుందని అన్నారు.
మా పూర్వీకులు భక్తి శ్రద్ధలతో పవిత్ర శ్రీ రామాలయం ( 15/02/1828 తారీఖు నా, స్వర్గీయ టేకూరు గాండ్ల చెంచు రెడ్డి భార్య బూసెమ్మ) నిర్మించారన్నారు.
నేడు భగవంతుని అనంత కృపతో
భక్తుల విశ్వాసంతో, గ్రామ ప్రజల సహకారంతో,ప్రభుత్వ అండదండలతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
మరలా నూతన కాంతులను సంతరించుకొని దివ్య కాంతుల మధ్య, విరాజిల్లుతున్న శ్రీ రామాలయం పునర్ ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుందన్నారు.
శ్రీరాముని సంకల్పమే ఈ మహత్తర కార్యానికి మూలం అని అన్నారు.
మా అమ్మ శ్రీ రామాలయ చైర్మన్ టేకూరి.రామ సుబ్బమ్మ ఆధ్వర్యంలో శ్రీ రామాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరగబోతోందన్నారు.
నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజవర్గం, పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామంలో శ్రీ రామాలయం ప్రాంగణంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈనెల అంటే జూన్ 15, 16, 17వ తేదీలలో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా
వేదమంత్ర ఘోషల మధ్య యాగాలు, హోమాలు, వైదిక పూజలు, భక్తి సంగీత కార్యక్రమాలు, ఆధ్యాత్మిక వేడుకలు ఉంటాయన్నారు. వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద, వసతి ఏర్పాటు చేయబడిందని అన్నారు.
ఎన్నో కార్యక్రమాలు తో పాటు, ముఖ్యం గా బాహుబలి హనుమాన్ శోభాయాత్ర, చెక్క భజన, కోలాటము ఆకర్షించబోతున్నాయని కొనియాడారు
టేకూరి.నాగేష్ సింగపూర్ నుంచి అన్ని కార్యక్రమాలను పరివీక్షచదము & స్వామి వారి సేవ భ్యాగ్యం కావడం చాలా ఆనందం గా ఉందిని కొనియాడారు.
రాజకీయాలకు అతీతంగా అందరూ స్వామి వారి సేవలో పాల్గోనాలని, ముఖ్యం వెంపెంట చుట్టుపక్కల గ్రామాలు, పాములపాడు మడలంలోనీ, అన్ని గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ఆహ్వానిస్తున్నాం అని అన్నారు.
ఈ దివ్య పునఃప్రతిష్ఠా మహోత్సవానికి
మీరు, మీ కుటుంబ సభ్యులతో సహా విచ్చేసి శ్రీ సీతారామచంద్ర హనుమాన్ స్వామివారి దివ్య ఆశీస్సులు పొందవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నామనీ అన్నారు.
Andhra
*వేంపెంట శ్రీ రామాలయం ప్రతిష్ట మహోత్సవానికి అందరికీ ఆహ్వాన పత్రికలు ఇచ్చిన చైర్మన్- టేకూరి. రామసుబ్బమ్మ* *వేంపెంట శ్రీ రామాలయ 98 సంవత్సరాల చరిత్రకు నూతన అధ్యాయం:-డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు(సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు)*
Quick Summary:
వేంపెంట శ్రీ రామాలయం ప్రతిష్ట మహోత్సవం