నేటి సాక్షి అనంతగిరి:
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలో కొత్త గోల్ తండా గ్రామ శివారులో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యనికి ఓ మూగజీవి ప్రాణాన్ని బలిగొంది. గ్రామ శివారులో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎలాంటి రక్షణ కవచం ఏర్పాటు చేయకపోవడంతో మేత కోసం వెళ్లిన పాడిగేదె విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది.సమాచారం అందుకున్న గేదె యజమాని సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.70 వేల వరకు ఉంటుందని, తనకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తగిన నష్టపరిహారం అందించాలని కోరారు.అనంతరం గ్రామస్థులు మాట్లాడుతూ.. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ రక్షణ కంచె లేకపోవడం వల్ల పశువులు, ప్రజలకు ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కవచం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.త్వరలో వరి నాట్ల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు పొలాల్లో ఎక్కువగా సంచరించే అవకాశం ఉందని, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని గేదె యజమాని, గ్రామస్థులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
Telangana
*అధికారుల నిర్లక్ష్యానికి పాడిగేదె మృతి*
Quick Summary:
అధికారుల నిర్లక్షమే....