నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
............................................
జగిత్యాల జిల్లాలో ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ అరవ చంద్రశేఖర రాజు అన్నారు.ఈ మేరకు సోమవారం ఇతర నాయకులతో కలిసి రాజు ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఏసీఎస్ రాజు మాట్లాడుతూ
ప్లాస్టిక్ వల్ల భూ, జల, వాయు కాలుష్యంతో పాటు క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు.
ప్లాస్టిక్ వల్ల జంతువులు కూడా మృతి చెందుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫంక్షన్ హాల్స్‌లో స్టీల్ వస్తువులు వాడాలని సూచించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని రాజు తెలిపారు.ఈ కార్యక్రమంలో చిట్ల గంగాధర్, సింగం గంగాధర్, వేముల పోచమల్లు, నరేందుల శ్రీనివాస్, వేముల దేవరాజం, కొత్తకొండ బాలయ్య, ఎడమల వెంకట్ రెడ్డి, గదాస్ భూమన్న, చిలుక రాజన్న, ఆడెపు జానయ్య, నాయిని సంజీవరావు, బొందుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
*ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నిషేదించాలి* *భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు వినతి* -------------------------------------------
Quick Summary:
భారత్ సురక్ష సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు వినతి