నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
.........................................
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ*
పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి పరిష్కారానికి చొరవ చూపాలని అన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
కాగా సోమవారం రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 98 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ఇదివరకు ప్రజావాణి లో వచ్చిన 197 పెండింగ్ దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని లేని యెడల సంబంధిత జిల్లా అధికారి బాధ్యునిగా చేస్తూ మెమో జారీ చేయబడునని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్లు బి. ఎస్. లత, బి. రాజ గౌడ్, రెవెన్యూ అధికారి ప్రసాద్, సంబంధిత జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్ లు మరియు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*ప్రజావాణి ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలి - జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఐఏఎస్* ------------------------------------------
Quick Summary:
ప్రజావాణి ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలి -