మన్ భూమి అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని , అధికారులు నిర్లక్ష్య ధోరణి వీడాలని మహాదేవ పురం డివిజన్ కైలాస్ హిల్స్ వాసులు డిమాండ్ చేసారు. తమ కాలనీ లో 30 ఫీట్ ల సీసి రోడ్డు ను ఆక్రమిస్తూ ప్రహరీ నిర్మాణం చేస్తున్నారని తమకు న్యాయం చేయాలని కైలాస్ హిల్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం కాలనీ కమాన్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
"సేవ్ అవర్ రోడ్, సేవ్ అవర్ కమ్యూనిటీ , సేవ్ అవర్ ఫ్యూచర్" అంటూ కాలనీ ప్రజలు ముక్త ఖంటంతో నినదించారు.
*అవినీతికి కేరాఫ్ గా గాజుల రామారం సర్కిల్ ...!*
:ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వ అధికారులే అక్రమ నిర్మాణాలకు అండగా వుంటున్నారని కైలాష్ హిల్స్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కాలనీకి చెందిన ముప్పై ఫీట్ల రోడ్డు మన్ భూమి కన్స్ట్రక్షన్ వారు ఆక్రమిస్తున్నారని టౌన్ ప్లానింగ్ అధికారులకు, డిసి దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని పలువురు స్థానికులు పేర్కొన్నారు.విలేకరుల సమావేశంలో కాలనీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ స్వయంగా గాజుల రామారం డీసి క్షేత్ర స్థాయిలో పర్యటించి రోడ్డు ఆక్రమనలను కూల్చివేయాలని ఆదేశించినా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అగ్రహం వ్యక్తం చేసారు. రోడ్డు పై చిన్న చిన్న డబ్బాలను తొలగించి పేదలను ఇబ్బంది పెట్టడంలో ఉన్న ఉత్సాహం బడా బాబుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు లేదని వారు ప్రశ్నిస్తున్నారు.గాజుల రామారం టౌన్ ప్లానింగ్ విభాగం అవినీతిమయంగా మారిందని ప్రజా ఆస్తులు కాపాడటంలో విఫలం అవుతూ అక్రమ నిర్మాణాలకు అండగా ఉంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులపై, సిబ్బంది పై చర్యలు తీసుకువాలని కైలాష్ హిల్స్ ప్రజలు డిమాండ్ చేసారు.
*పోలీసుల తీరు శోచనీయం...*:
తమ కాలనీ లో మన్ భూమి కన్స్ట్రక్షన్ వారు రోడ్డును ఆక్రమిస్తున్నారని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా అధికారులు మా కాలనీ ప్రజలనే భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహారిస్తున్నారని కైలాష్ హిల్స్ వాసులు పేర్కొంటున్నారు. తాము పిర్యాదు చేస్తే కబ్జా విషయం సివిల్ అంశం అని తమ పిర్యాదు ను వాపస్ తీసుకొమ్మన్న పోలీసులు తాము న్యాయ పోరాటం చేస్తుంటే తిరిగి మాపైనే కేసులు పెడతాం అని అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.రోడ్డు ఆక్రమణకు గురవుతున్నా చూస్తూ వుండలా అంటూ పోలీసుల జులుం నశించాలని, టౌన్ ప్లానింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేసారు.
*హైడ్రా అధికారులైనా చర్యలు తీసుకోవాలి....*:అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులే ముడుపులు తీసుకుని మౌనంగా వుంటున్నారని, న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయిస్తే తిరిగి మాపైనే కేసులు పెడుతున్నారని హైడ్రా అధికారులైనా స్పందించి అక్రమ నిర్మాణదారులపై చర్యలు తీసుకుని రోడ్డు స్థలాన్ని కాపాడాలని కైలాష్ హిల్స్ సంక్షేమ సంఘం నాయకులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.మన్ భూమి నిర్మాణం మొదలు పెట్టిన నాటినుండే ఎన్నో వివాదాలకు దారి తీస్తుందని, ఒక్కో అడుగు ముందుస్తూ తమ కాలనీ స్థలాన్ని, రోడ్లను మన్ భూమి నిర్మాణదారులు కబ్జా చేస్తున్నారని హైడ్రా అధికారులైనా తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.అక్రమంగా ఆక్రర్మిస్తున్న 30 ఫీట్ల సీసీ రోడ్డును కాపాడుకునే వరకు మన్ భూమి నిర్మాణదారుల అక్రమాలపై చర్యలు తీసుకొనే వరకు కైలాష్ హిల్స్ ప్రజలం ఒక్కతాటిగా పోరాడతాం అని ఈ సందర్బంగా వారు తెలిపారు.
Telangana
*మన్ భూమి అక్రమ నిర్మాణాలకు అధికారుల అండ* *30 ఫీట్ల రోడ్డునుu కాపాడి కబ్జాలను అడ్డుకోవాలి* *న్యాయం చేయాలంటూ కైలాష్ హిల్స్ వాసుల డిమాండ్.* *హైడ్రా అధికారులపైనే వారి ఆశలు*: *కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా...*: *పెద్ద ఎత్తున హాజరైన కాలనీ వాసులు...*: *న్యాయం జరిగే వరకు పోరాడతామని ప్రకటన..*:
Quick Summary:
*మన్ భూమి అక్రమ నిర్మాణాలకు అధికారుల అండ*