నేటి సాక్షి న్యూస్ జూన్ 17
పెద్దకడబూరు పొలంలో వర్షపు నీరు పారే గట్టు విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీయడంతో నలుగురు గాయపడ్డారు. పెద్దకడబూరు మండల పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బుధవారం ఎస్సై మారుతి తెలిపిన వివరాల ప్రకారం, పెద్దకడబూరు గ్రామానికి చెందిన కురువ నాగన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కురువ మునెప్పతో పాటు అతని కుమారులు అల్లప్ప, నాగరాజుపై కేసు నమోదు చేశారు. పొలంలోని వర్షపు నీరు పారే గట్టు విషయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా అది ఘర్షణగా మారింది.
ఈ క్రమంలో నిందితులు పారతో దాడి చేయడంతో నాగన్న, భీమేష్, వీరనాగుడు, నరసన్నలకు చేతులు, కాళ్లపై గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Andhra
హెడ్లైన్ : వర్షపు నీటి గట్టు వివాదం ఘర్షణకు దారి _ నలుగురికి గాయాలు.. కేసు నమోదు
Quick Summary:
వర్షపు నీటి గట్టు వివాదం ఘర్షణకు దారి