Telangana
ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులుగా పందిరి సైదులు
Quick Summary:
ఉద్యమ కళాకారుల సంఘం
నేటిసాక్షి, నల్లగొండ : తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులుగా నల్లగొండ పట్టణానికి చెందిన పందిరి సైదులు ను ఏకగ్రీవంగా ఎన్నుకునట్లు తెలిపారు. మంగళవారం హైదరాబాదులోని బషీర్బాగ్ కళాభారతి లో జరిగిన కార్యక్రమంలో నియామక పత్రం అందించినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు అనువోజు వెంకన్న, రాష్ట్ర అధ్యక్షులు దరువు అంజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ నకిరేకంటి కిరణ్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పందిరి సైదులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది కళాకారులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసి తమ కుటుంబాలను సైతం లెక్కచేయకుండా ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా ఉద్యమాలలో పాల్గొంటే, తెలంగాణ ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాలయాపన జరుగుతుందని, వెంటనే ఇప్పటి ప్రభుత్వం ఉద్యమ కళాకారులకు సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నల్లగొండ జిల్లా ఉద్యమ కళాకారులు కందుకూరి సుదర్శన్, అంకెపాక కోటేష్ నకిరేకంటికే వేణు, రేముడాల శ్రీనివాస్, రామ కమలహాసన్, కలకొండ శ్రీనివాస్, ఏ ఎల్లయ్య, కంచి శ్రీనివాస్, కంజర శ్రీను, దారం మల్లేష్ యాదవ్,ఎస్ సత్యనారాయణ, కందుల పెద్ద సైదులు తదితరులు అభినందనలు తెలిపారు.