*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
బ్యాండ్ కళాకారుల న్యాయమైన డిమాండ్లకు తన మద్దతు ఎల్లవేళలా ఉంటుందని జగద్గిరిగుట్ట డివిజన్ మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ పేర్కొన్నారు. ఈనెల 16వ తేదీన సుందరయ్య కళానిలయంలో నిర్వహించనున్న బ్యాండ్ కళాకారుల రాష్ట్ర సదస్సు వాల్ పోస్టర్ ను గురువారం మాజీ కార్పొరేటర్ నివాస కార్యాలయంలో బ్యాండ్ కళాకారులు, యజమానుల సమక్షంలో ఆవిష్కరించారు.
వివాహ, ఇతర శుభకార్యాలతో పాటు వివిధ బోనాల పండుగ తదితర శుభకార్యాలే కాకుండా అంతిమయాత్ర లాంటి ప్రతి కార్యక్రమాలలో బ్యాండ్ కళాకారులు నిత్యవసరంగా మారారని మాజీ కార్పొరేటర్ కొలుకుల జగన్ పేర్కొన్నారు. నిత్యం ప్రజలలో మమేకమై వారి శుభకార్యాలకు ఇతర కార్యక్రమాలకు ఉపయోగపడుతున్న బ్యాండ్ కళాకారుల పట్ల పోలీసులు అక్రమ కేసులు బనాయించడం సరైనది కాదని తెలిపారు. ముఖ్యంగా వారి ప్రధాన డిమాండ్లైన పోలీస్ కేసులు, బ్యాండ్ సీజ్ చేయడం, శబ్ద కాలుష్యం లాంటి పై కేసులు తదితర డిమాండ్లను వెంటనే ప్రభుత్వం అంగీకరించి వారికి మద్దతుగా నిలవవలసిన అవసరం ఉందని సూచించారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కొలుకుల జైహింద్, బ్యాండ్ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాచర్ల శేఖర్, ఉపాధ్యక్షులు మైముద్, కాజ మియా, హరీష్, గోపాల్, నాగేందర్, గణేష్, కాశయ్య, గిరీష్, రహీం, బసవరాజ్, దానయ్య తదితరులు పాల్గొన్నారు.
Telangana
*బ్యాండ్ కళాకారుల న్యాయమైన డిమాండ్లకు తన మద్దతు తెల్పిన జగన్*:
Quick Summary:
బ్యాండ్ కళాకారుల న్యాయమైన డిమాండ్లకు తన మద్దతు తెల్పిన జగన్....