నేటిసాక్షీ మంచిర్యాల, జూన్ 16( శ్రీధర్ దమ్మ)
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (DM&HO) కార్యాలయంలో నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జిల్లా వైద్యాధికారి శ్రీ డాక్టర్ నరేందర్ రాథోడ్ గారిని మంగళవారం తలసేమియా వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సొసైటీ తరఫున ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
అదేవిధంగా, జిల్లాలోని తలసేమియా మరియు సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ఎక్కడా లేని విధంగా అత్యంత ఖరీదైన 'హైడ్రాక్సీ యూరియా', 'పెంటెడ్ సోడా మెంట్' మందులను ప్రత్యేకంగా తెప్పించి, బాధితులకు ఉచితంగా అందించడంలో కీలక పాత్ర పోషించిన అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ నాయక్ గారిని కూడా సొసైటీ సభ్యులు కృతజ్ఞతా భావంతో ఘనంగా సన్మానించారు.
బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి: కాసర్ల శ్రీనివాస్
ఈ సందర్భంగా తలసేమియా వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధి కాసర్ల శ్రీనివాస్ నూతన డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ గారితో మాట్లాడుతూ.. జిల్లాలోని తలసేమియా, సికిల్ సెల్ వ్యాధిగ్రస్తుల ఆరోగ్య పరిస్థితిని వివరించారు. బాధితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, వారికి ఎనలేని వైద్య సేవలు అందించాలని కోరారు. అలాగే బాధితులకు ఎంతగానో ఉపయోగపడే 'పెంటెడ్ సోడా మెంట్' టాబ్లెట్లను నిరంతరాయంగా అందేలా చొరవ చూపాలని డిఎంహెచ్ఓ గారిని అభ్యర్థించారు.
సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధం: డిఎంహెచ్ఓ
సొసైటీ విన్నపాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డాక్టర్ నరేందర్ రాథోడ్ గారు సానుకూలంగా స్పందించారు. జిల్లాలోని తలసేమియా వ్యాధిగ్రస్తులకు జిల్లా వైద్య శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితులకు వైద్య సేవలను మరింత మెరుగుపరుస్తామని, వైద్య పరంగా ఎలాంటి సమస్యలున్నా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
ఈ మానవీయ కార్యక్రమంలో తలసేమియా వెల్ఫేర్ సొసైటీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బొజ్జా వెంకటయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి బండ అవినాష్, జాయింట్ సెక్రెటరీ రత్నం తిరుపతి, ప్రతినిధులు దుర్గం ప్రవీణ్ కుమార్, దుర్గం ప్రవీణ్, గాండ్ల స్వాతి తదితరులు పాల్గొన్నారు.
Telangana
మంచిర్యాల నూతన డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్‌కు తలసేమియా వెల్ఫేర్ సొసైటీ ఘన సన్మానం వ్యాధిగ్రస్తులకు అండగా ఉంటాం: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) ఖరీదైన మందులు అందించి ఆదుకున్న అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ నాయక్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
Quick Summary:
మంచిర్యాల నూతన డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్‌కు