వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి.
ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు జిల్లా కలెక్టర్ శ్రీ దీపక్ తివారి
ఐడిఓసి మీటింగ్ హాల్ నందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే. సుధాకర్ లాల్ సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న వివిధ చర్యలను, వివిధ శాఖల మధ్య సమన్వయం గురించి వివరించారు. ముఖ్యంగా ఈ కాలంలో ప్రబలే మలేరియా, డెంగ్యూ నివారణ, నియంత్రణకు తీసుకోవలసిన వివిధ జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సమాజంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మలేరియా డెంగ్యూ, వివిధ సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రభుత్వ కార్యాలయాలలో, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ లలో అవగాహన కల్పించే బోర్డులను ఏర్పాటు చేయించాల్సిందిగా DMHO ను ఆదేశించారు.
అనంతరం IDOC లో ఏర్పాటుచేసిన దోమలు పెరిగే ప్రదేశాలైన వాడి పరవేసిన కొబ్బరి బొండాలు, పగిలిన మట్టి కుండలు, పాత టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు వంటివి ఏర్పాటు చేసిన అవగాహన శిబిరాన్ని సందర్శించారు.
Telangana
సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.
Quick Summary:
వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి.