నేటి సాక్షి 28 జూన్ నంద్యాల:-
నేడు నంద్యాల జిల్లా కేంద్రం, సెయింట్ జోసెఫ్ పాఠశాలలో జిల్లా అధ్యక్షుడు ఎన్.వి. భాస్కర రెడ్డి గారి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ రోజు జరిగిన కార్యక్రమంలో పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు ఎన్.వి . భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై రాంపక్కి రెడ్డి, జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎస్ భార్గవ రామయ్య పలు ఉపాధ్యాయ సమస్యలపై మాట్లాడారు.
జిల్లా అధ్యక్షుడు ఎన్.వి. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ
* జిల్లాలకు ఉపాధ్యాయుల పంపిణీ కంటే ముందు అర్హత కలిగిన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు,
* టెట్ నుంచి అందరికీ మినహాయింపు కలిగేలా విద్యాహక్కు చట్టం సెక్షన్ 21 (2) కి సవరణ చేయాలని, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపి టెట్ నుంచి అందరికీ మినహాయింపు కలిగేలా చూడాలని కోరారు.
* ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ 2025 ఉద్యోగుల వర్కింగ్ స్ట్రెంగ్త్ కాకుండా సెక్షన్డ్ స్ట్రెంగ్త్ వరకు భర్తీ చేయాలి., స్పౌస్ వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష మాట్లాడుతూ,
* 2003 డీఎస్సీ వారికి పాత పెన్షన్ వర్తింపు అభినందనీయం అని అన్నారు, అదే విధంగా 1.9.2004 తర్వాత, నియమితులైన ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
* PRC కమిషన్ ఏర్పాటు చేయాలి. అంతవరకు 30% మధ్యంతర భృతి IR చెల్లించాలి అని డిమాండ్ చేశారు.
* పెండింగ్ DA లలో కనీసం రెండు తక్షణమే విడుదల చేయాలని కోరారు.
* 2022 నుంచి పెండింగ్ లో వున్న సరెండర్ లీవ్ నగదు జమ చేయాలని కోరారు.
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై రాంపక్కి రెడ్డి మాట్లాడుతూ,
* ఉమ్మడి సర్వీస్ రూల్స్ రూపొందించి పర్యవేక్షణ పోస్టులైన ఎంఈఓ డి వై ఈ ఓ పోస్టులను, జె ఎల్ డైట్ ఐఏఎస్ఇ లెక్చరర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు.
* ప్రస్తుత వర్క్ అడ్జస్ట్మెంట్ ను వాయిదా వేయాలన్నారు., పాఠశాలల్లో ఇంకా అడ్మిషన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల సర్దుబాటు సహేతుకం కాదన్నారు.
* ఉపాధ్యాయుల కొరత వున్న చోట, తాత్కాలికంగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్ లను నియమించాలని కోరారు.
* మోడల్, కేజీబీవీ, మున్సిపల్ ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా డీఎస్సీ2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపుకు కృషి చేసిన ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు గారికి, మరియు రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు పి రాజశేఖర్ రెడ్డి, బి రవీంద్ర రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, వై. వి. రమణయ్య, ఆడిట్ కమిటీ కన్వీనర్ లక్ష్మణ్, నాయకులు సుదర్శన్ రెడ్డి, రజనీకాంత్ రెడ్డి, పి శ్రీనివాసులు, S కలిముల్లా, సుమియన్, రాజశేఖర్ రెడ్డి, మొయినుద్దీన్ వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Andhra
*జిల్లా కార్యవర్గ సమావేశంలో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం డిమాండ్* **ఉపాధ్యాయ పదోన్నతులు* *చేపట్టాలి* :- *పి ఆర్ టి యు* . *డిమాండ్* .
Quick Summary:
కార్యవర్గ సమావేశంలో ఉపాధ్యాయ సమస్యల
