Telangana
క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో సుప్రీం టీం
Quick Summary:
ముత్తారం క్రికెట్ యాక్షన్ 2026
నేటి సాక్షి: (శ్రీకాంత్ మాడుగుల) భీమదేవర పల్లి మండలం క్రికెట్ ఆట పోటీ విజేత..... ముత్తారం క్రికెట్ యాక్షన్ 2026 జరిగిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్ లో సుప్రీం టీం విజేతగా నిలిచింది రన్నరపుగా విద్యాధర్ టీం నిలవడం జరిగింది ఈ యొక్క బహుమతి ప్రధానోత్సవం ముత్తారం గ్రామపంచాయతీ వద్ద నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి ఎలుకతుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ స్రవంతి గారి చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది. మొదటి బహుమతి ట్రోఫీ మరియు 10,000/- రూపాయలు అందించారు, రెండో బహుమతికి ట్రోఫీ మరియు 5000 రూపాయలను అందించడం జరిగింది. ఈ యొక్క టోర్నమెంట్ కు ట్రోఫీలు బహుమతి చేసినవారు కొర్ర శ్రీకాంత్ నాయక్ స్పాన్సర్ చేశారు. రెండవ బహుమతికి 5000 నగదును భీమదేవరపల్లి మండలం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సువాసిని గారు స్పాన్సర్ చేశారు. విజేతల టీం సభ్యులకు మెడల్స్ కుర్ర శ్రీకాంత్ స్పాన్సర్ చేశారు. యొక్క కార్యక్రమానికి ఆర్గనైజర్ గా రేణికుంట్ల విద్యాసాగర్ వ్యవహరించారు ఈనెల 25వ తేదీన టీం లో ఎంపిక చేయడంలో ముత్తారం గ్రామ ఇన్చార్జ్ సర్పంచ్ హరికుమార్ ఆధ్వర్యంలో జరిగింది అట్టి టీములు శనివారం ఆదివారం క్రికెట్ ఆడి విజేతలను ప్రకటించడం జరిగింది. దీనికి సహకరించిన మండల ప్రజలకు మరియు క్రికెట్ ప్రేమికులకు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపినారు...
