నేటిసాక్షి, మిర్యాలగూడ : టీయూడబ్ల్యూజే (ఐజేయు) నల్లగొండ జిల్లా కమిటీ పిలుపుమేరకు సోమవారం జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కలిమెల నాగయ్య, టీయూడబ్ల్యూజే జిల్లా ప్రచార కార్యదర్శి ఎండిఅస్లాం ఆధ్వర్యంలో మిర్యాలగూడ టీయూడబ్ల్యూజే (ఐజేయు) యూనియన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ డీఏఓ శ్రీనివాస శర్మ, మండల విద్యాధికారి ధర్మానాయక్ లకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
జర్నలిస్టు కుటుంబాల పిల్లలకు పాఠశాలలలో ఫీజు రాయితీ కల్పించాలని కోరారు.
ఫీజు రాయితీ సర్కులర్ జారీ చేసేంతవరకు ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డివిజన్ టీయూడబ్ల్యూజే (ఐజేయు) అధ్యక్షులు
బాలాజీ రావు, ప్రధాన కార్యదర్శి రమేష్. సీనియర్ జర్నలిస్టులో నామిరెడ్డి నరేందర్ రెడ్డి, ఖాజా నాజీముద్దిన్, సుమన్, కిషోర్ జిల్లా ప్రచార కార్యదర్శి కాతోజు నాగ చారి, బండ వేణుగోపాల్ రెడ్డి, అశోక్, రాచకొండ రమేష్, సునీల్ చౌదరి, కిషోర్, శీను, కాట్రాజ్ అశోక్, నక్క శ్రీను, వెంకన్న, హరీష్ బాబు, తోఫిక్, కట్ట బాబు, షేక్ వసీం, రాయించు నగేష్
తో పాటు పలువురు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
జర్నలిస్టు కుటుంబాల పిల్లలకు ఫీజులలో రాయితీ కల్పించాలి -ధర్నా నిర్వహించిన జర్నలిస్ట్ లు... -అధికారులకు వినతిపత్రం అందజేత
Quick Summary:
-అధికారులకు వినతిపత్రం అందజేత