నేటి సాక్షి - జగిత్యాల
(పూరెళ్ల బాపు )
.......................................
దేశవ్యాప్తంగా ఈ నెల 21 వ తేదీన NEET Re-exam జరుగతున్నది. ఈ పరీక్ష జగిత్యాల జిల్లాలో మూడు పరీక్ష కేంద్రాలలో నిర్వహించబడుతుంది. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా మూడు పరీక్షా కేంద్రాలలో 807 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకాబోతున్నారు. పరీక్ష కేంద్రాలు SKNR Arts and science Govt degree college, ధర్మపురి రోడ్డు, JNTUH college of engineering నాచుపల్లి కొండ గట్టులలో రెండు కేంద్రాలు ఉన్నాయి. ఈ పరీక్ష నిర్వహణకు తీసుకోవలసిన ఏర్పాట్లను గూర్చి ఈ రోజు జిల్లా అదనపు కలెక్టర్ బి ఎస్ లత గారి సమక్షములో జిల్లా యంత్రాంగానికి విది విధానాలు గూర్చి తెలియజేయడం జరిగింది. NEET Re-exam పకడ్బందిగా నిర్వహించాలని ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎస్. లత గారు తెలియజేశారు.
*పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కొన్ని సూచనలు*
*> ఈ సారి పరీక్ష సమయము మధ్యాహ్నం 2 గం॥ల నుండి 5-15 నిమిషాల వరకు నిర్వహించును.*
*> దివ్యాంగులకు 2 గం||ల నుండి 6-20 నిమిషాల వరకు నిర్వహించబడును.*
*> పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కొత్త అడ్మిట్ కార్డును తీసుకుని రావాలి. పాత అడ్మిట్ కార్డు చెల్లదు.*
*> అడ్మిట్ కార్డుపై ఉన్న అడ్రస్ ప్రకారం పరీక్ష కేంద్రానికి హాజరుకావాలి.*
*> పరీక్ష కేంద్రంలోకి ఉదయం 11 గం॥ల నుండి మధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే అనుమతిస్తారు, ఒక్క నిమిషము ఆలస్యమైనా అనుమతి ఉండదు.*
*> అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటుగా ఏదైన ఒక ID కార్డు తీసుకుని రావాలి.*
*> అడ్మిట్ కార్డుతో పాటు ఉన్న పోస్టు కార్డు సైజు ఫోటో అంటించి తీసుకుని రావాలి.*
*> 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అదనంగా ఉంచుకోవాలి.*
*> Transparent Water బాటిల్ మాత్రమే అనుమతిస్తారు.*
*> పరీక్ష కేంద్రంలో ఇచ్చిన పెన్ తోనే పరీక్ష వ్రాయాలి.*
*> ప్రతి అభ్యర్థి పరీక్ష కేంద్రానికి రెండు అడ్మిట్ కార్డు తీసుకునిరావాలి ఒకటి పరీక్ష అయిన తరువాత పరీక్ష కేంద్రంలో సమర్పించాలి, రెండవది మీరు తీసుకుని వెళ్ళ వచ్చు.*
*> ఏ విధమైన ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.*
*> 1.30 గం||ల తరువాత పరీక్ష కేంద్రం మెయిన్ గేటు మూసివేయబడును.*
పై విషయాలను విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గమనించి పరీక్షా కేంద్రానికి తగిన సమయానికి చేరుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ గారు పత్రిక ప్రకటనలో తెలియజేశారు.
Telangana
*NEET పరీక్ష జిల్లా యంత్రాంగానికి పకడ్బందిగా నిర్వహించేలా విది విధానాలు ఏర్పాట్లు* ,*జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ బి ఎస్ లత* -----------------------------------------
Quick Summary:
*NEET పరీక్ష జిల్లా యంత్రాంగానికి పకడ్బందిగా నిర్వహించేలా విది విధానాలు ఏర్పాట్లు*