నేటిసాక్షి, మిర్యాలగూడ : పాఠశాలలు ప్రారంభం అయిన నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలో మొదలైన ఫీజుల దోపిడిని అరికట్టాలని నియోజకవర్గ పరిధిలోని
దామరచర్ల మండలం లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం మండల విద్యాధికారి కి సైదా నాయక్ కు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల కార్యదర్శి మాలోత్ వినోద్ నాయక్ మాట్లాడుతూ, 2026 -27 విద్యా సంవత్సరం గాను పాఠశాలలు అన్నీ కూడా ప్రారంభమైన సందర్భంగా, అన్ని ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులను వసూలు చేస్తూ , పాఠశాలలలో నోట్ బుక్స్, యూనిఫార్మ్స్ అమ్ముకుంటూ పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని, వెంటనే అధికార యంత్రాంగం అన్ని ప్రైవేటు పాఠశాలలలో పర్యవేక్షణ నిర్వహించి, పాఠశాలల్లో ఉన్న నోట్ బుక్స్, యూనిఫార్మ్స్ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. మండలంలో ప్రతి సంవత్సరం ఒక నూతన ప్రైవేటు పాఠశాల ఏర్పాటు చేస్తున్న తరుణంలో వీటివలన మండలంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా నిర్వర్యం అవకాశం ఉన్నదని, కాబట్టి విద్యాధికారులు వెంటనే ప్రైవేటు పాఠశాలలను ఉక్కు పాదం మోపి, ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకొని, విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలని, విద్యా హక్కు చట్టాన్ని అమలు అయ్యే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు దయానంద్, సుభాని, విజయ్, తదితరులు పాల్గొన్నారు.
Telangana
విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి -ప్రైవేటు పాఠశాలలో ఫీజుల దోపిడిని అరికట్టాలి -ఎంఈఓ కు వినతిపత్రం అందజేసిన : సిపిఎం పార్టీ నాయకులు
Quick Summary:
విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి