నేటి సాక్షి 30 జూన్ ఆత్మకూరు:-
నేడు, నంద్యాల జిల్లా ఆత్మకూరు నందు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ) లో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ నేటితో పదవీ విరమణ పొందిన శ్రీ ఎం మోమిన్ వలి గారిని పి ఆర్ టి యునంద్యాల జిల్లా నాయకులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, మిత్రులు ఘనంగా సన్మానించారు,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి ఎం అయూబ్ అహ్మద్, పి ఆర్ టి యు నంద్యాల జిల్లా అధ్యక్షుడు ఎన్.వి. భాస్కర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాంద్ బాష, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై రాంపక్కి రెడ్డి, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్ బాబు, మాట్లాడుతూ మోమిన్ వలి గారు తన జీవిత కాలంలో విద్యాభివృద్ధి కోసం చేసిన సేవలను కొనియాడారు.
దాదాపు 3 దశాబ్దాల తన ఉపాధ్యాయ జీవితంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నత చేర్చిన ఘనత ఆయనది అని అన్నారు.
తన సర్వీస్ లో ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఆయన, వారి వద్ద శిక్షణ పొందిన వారి విద్యార్థులు వారిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తాలూకా పరిధిలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పి ఆర్ టి యు రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇబ్రహీం, కె హుస్సేన్ సాహెబ్, పి నూర్ మొహమ్మద్, రామిరెడ్డి, జిల్లా నాయకులు ఎం చంద్రశేఖర్, ఆత్మకూరు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సి ప్రదీప్ కుమార్, జి హనుమంతు, కొత్తపల్లి మండల అధ్యక్షుడు సయ్యద్ కలిముల్లా,పాములపాడు మండల అధ్యక్షడు ఎ సాంబ శివుడు, వెలుగోడు మండల అధ్యక్షుడు సయ్యద్ మొయినుద్దీన్, నంద్యాల మండల అధ్యక్షుడు కలిముల్లా వివిధ పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, బంధుమిత్రులు , స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Andhra
*పదవీ విరమణ శుభాకాంక్షలు* మోమిన్ వలి గారిని ఘనంగా సన్మానించిన పాఠశాల ఉపాధ్యాయ బృందo *ఘనంగా సన్మానించిన పి ఆర్ టి యు నాయకులు*
Quick Summary:
పదవీ విరమణ శుభాకాంక్షలు
