నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
.......................................
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని జగిత్యాల ఆర్టీసీ డిపో నూతన డిపో మేనేజర్ గా ఎన్. రమేష్ అన్నారు.రమేష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కల్పన బదిలీపై వెళ్లగా ఆమే స్థానంలో రమేష్ డిపో మేనేజర్ గా రాగా బాధ్యతలు స్వీకరించగా
డిపో సిబ్బంది ఆయనకు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం డి ఎం రమేష్ మాట్లాడుతూ బస్సుల సమయపాలన, శుభ్రత, సిబ్బంది క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. డిపో అభివృద్ధి కోసం సిబ్బంది అందరి సహకారం కావాలని కోరారు.
డిపో సిబ్బంది మాట్లాడుతూ డీఎం రమేష్ అనుభవం, చొరవతో జగిత్యాల డిపో మరింత ప్రగతి సాధిస్తుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిపో అధికారులు, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ సిబ్బంది పాల్గొన్నారు.
Telangana
*ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం* *జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్‌గా రమేష్ బాధ్యతల స్వీకరణ* ----------------------------------------
Quick Summary:
ప్రయాణికులకు మెరుగైన సేవలు....
