*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
ప్రతి సంవత్సరం ఐఐటిలో ప్రవేశాలకై నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ఉత్తరాఖండ్లోని "ఐఐటి రూర్కిలో జియో టెక్నాలజీ" విభాగంలో సీటు సాధించిన కుత్బుల్లాపూర్ సత్జ్ఞాణ్ హై స్కూల్ పూర్వ విద్యార్థిని కె.అంజలీదేవి స్కూల్ కరస్పాండెంట్ చింతల మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో శనివారం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ మాట్లాడుతూ.... నేటి సమాజంలో బాలురతో పోటీపడుతూ బాలికలు ఎన్నో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని నిదర్శనం విద్యార్థిని అంజలీదేవి అని, పేదరికంలో పుట్టి చదువు పట్ల ఆసక్తితో చిన్ననాటి నుంచి మంచి విద్యతో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ అంచలంచెలుగా ఎదుగుతున్న విద్యార్థిని అంజలీదేవి విద్యాభ్యాసానికి తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని, పుట్టిన ఊరికి కన్న తల్లిదండ్రులకు మంచి పేరును తెస్తూ విద్యార్థిని అంజలి దేవి మరింత అభివృద్ధి చెందాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ చింతల మానస్, విద్యార్థిని చిన్నాన్న రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Telangana
*విద్యార్థిని ప్రతిభకు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ సత్కారం..*
Quick Summary:
ప్రతి సంవత్సరం ఐఐటిలో ప్రవేశాలకై నిర్వహించే