నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఫుట్ పాత్ పై మరియు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీ, మరియు భవనాల గోడలకు పైపులను అమర్చుకుని ఏర్పాటు చేసుకున్న దుకాణ సముదాయాలపై గత నెల 12న నేటి సాక్షులో ప్రచురితమైన కథనానికి స్పందించిన జిల్లా కలెక్టర్ నందలాల్ పవర్ సంబంధిత అధికారులకు దుకాణాలను తొలగించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. జారీచేసిన రెండు రోజులు మాత్రం సంబంధిత అధికారులు నానా హడావుడి చేసి చేతులు దులిపేశారు. ఇది ఇలా ఉండగా పాఠశాల ముందు నూతనంగా మురుగు కాలువ నిర్మించే పనిలో భాగంగా ప్రహరీని ఆనుకొని ఉన్న కొన్ని దుకాణాలను తొలగించడం జరిగింది. తొలగించే సమయంలో సంబంధిత దుకాణదారులతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఈ జాతీయ రహదారిపై చిలుకూరు మండల కేంద్రంలో నూతనంగా బస్టాండ్ నిర్మించేందుకు గ్రామానికి చెందిన కొందరు దాతలు ముందుకు వచ్చారు కానీ పలువురు రాజకీయ నాయకులు తమదైన శైలిలో జోక్యం కల్పించుకొని నిర్మాణాన్ని అడ్డుకుంటున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కలెక్టర్ ఆదేశాలను పాటిస్తారని గ్రామస్తులు కోరుతున్నారు.
Telangana
*కలెక్టర్ మౌఖిక ఆదేశాలు బేఖాతర్....*
Quick Summary:
జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఫుట్