నేటి సాక్షి - జగిత్యాల టౌన్
(పూరెళ్ల బాపు )
........................................
జగిత్యాలకు చెందిన లంకన్నగారి శ్వేష్ట రెడ్డి అనే 2 సంవత్సరాల 11 నెలల 22 రోజుల బాలిక అరుదైన ఘనత సాధించింది.ఇండియా బుక్ అఫ్ రికార్డ్స్ లో శ్వేష్ట రెడ్డి చోటు దక్కించుకుంది.
భారతదేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులను కేవలం 1 నిమిషంలో గుర్తుచేసి, అత్యంత వేగంగా చెప్పిన టాడ్లర్‌గా రికార్డు సృష్టించింది.2023 జూన్ 17న హైదరాబాద్‌లో జన్మించిన శ్వేష్ట రెడ్డి, జగిత్యాలకు చెందిన బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ- పద్మలత ల మనుమరాలు ఈ ఘనతను 2026 జూన్ 8న సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఆమె ప్రతిభను గుర్తించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2026, జూన్ 8న అధికారికంగా ధృవీకరించగా రెండు రోజుల క్రితం శ్వేష్ట రెడ్డికి సర్టిఫికెట్ అందించారు.
ఫాస్టెస్ట్ టాడ్లర్ టు రీకాల్ క్యాపిటల్స్ ఆఫ్ ఆల్ ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ విభాగంలో ఆమెకు ఐబిఆర్ అచీవర్ సర్టిఫికెట్, మెడల్ అందజేశారు. చిన్న వయసులోనే అసాధారణ జ్ఞాపకశక్తిని ప్రదర్శించిన శ్వేష్ట ఘనత రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచింది.
*తల్లి,తండ్రి వేధస్విని- పవన్ ల సంతోషం*
“చిన్నప్పటి నుంచే శ్వేష్టకి మ్యాప్స్, రాష్ట్రాల పేర్లంటే చాలా ఇంట్రెస్ట్. ఆటగా మొదలై, రోజూ ప్రాక్టీస్ చేస్తూ ఇంత పెద్ద రికార్డు తీసుకొచ్చింది. మా కూతురు సాధించినది చూసి గర్వంగా ఉందని పేరెంట్స్ సంతోషంగా చెప్పారు.
*అమ్మమ్మ -తాత ముసిపట్ల లక్ష్మీనారాయణ -పద్మలత*
“శ్వేష్ట సాధన మా కుటుంబానికే కాదు, తెలంగాణకు కూడా గర్వకారణం. టీచర్లు, బంధువులు అందరి ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైంది. భవిష్యత్తులో ఇంకా పెద్ద లక్ష్యాలు ఛేదించాలని కోరుకుంటున్నాం.
Telangana
*జగిత్యాల బాలిక శ్వేష్ట రెడ్డి అరుదైన ఘనత* *ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు* -----------------------------------------
Quick Summary:
*జగిత్యాల బాలిక శ్వేష్ట రెడ్డి అరుదైన ఘనత*
