నేటి సాక్షి వికారాబాద్ :
వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం ఎనికెపల్లి సమీపంలోని ఆదర్శ పాఠశాల, కళాశాల, వసతి గృహంను ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజనానికి సంబంధించిన వంటకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని వంట, నిత్య అవసరాల సరుకుల నిల్వ గదులను పరిశీలించి పాఠశాల ఆవరణలో కనీస వసతులపై అధికారులను కలెక్టర్ అడిగి తేలుకున్నారు. వసతి గ్రహంలో కనీస వసతులతో పాటు డ్రైనేజ్, చిన్న చిన్న మరమ్మత్తు పనులకు సంబంధించి అంచనాలను రూపొందించి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. వసతి గృహ పరిసరాలు అదేవిధంగా వంట, సరుకుల నిల్వ గదిని పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల/ కళాశాల తరగతి గదులను సందర్శించి విద్యార్థుల సంఖ్య పై కలెక్టర్ ఆరా తీశారు.
అనంతరం ఆవరణలో ఔషధ మొక్కలను పరిశీలించి వాటి సంరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులు సూచించారు.
కలెక్టర్ తో పాటు జిల్లా విద్యాధికారి మహమ్మద్ అబ్దుల్ ఘని, తహసిల్దార్ విజయ్, పంచాయతీ రాజ్ ఎఇ మధుసూధన్, వార్డెన్ విజయలక్ష్మీ, సర్పంచ్ దయాకర్, పాల్గొన్నారు.
Telangana
మెనూ ప్రకారం వసతి గృహంలో నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలి. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ.
Quick Summary:
మెనూ ప్రకారం వసతి గృహంలో నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలి.

