నేటి సాక్షి న్యూస్ జూన్ 17
మంత్రాలయం కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రాలయం నియోజకవర్గంలో విజయోత్సవ సభను టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభలో మాట్లాడిన ఎన్. రాఘవేంద్ర రెడ్డి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. గత రెండేళ్ల కాలంలో నియోజకవర్గంలో మొత్తం రూ.488.62 కోట్ల వ్యయంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినట్లు తెలిపారు. ఇందులో మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, తాగునీటి సౌకర్యాలు, ఇతర అభివృద్ధి పనులకు రూ.350 కోట్లు వెచ్చించగా, వివిధ సంక్షేమ పథకాల అమలుకు రూ.138.62 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందన్నారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని, ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని తెలిపారు. సభలో పాల్గొన్న జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో ముందంజలో ఉందన్నారు. గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి అవకాశాల కల్పన వంటి అంశాల్లో ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం సమిష్టిగా పనిచేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ రెండేళ్ల పాలనకు మద్దతు తెలిపారు. సభలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నాయకులు ప్రజలకు వివరాలు తెలియజేశారు.
Andhra
హెడ్లైన్ : మంత్రాలయం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ _ అభివృద్ధి, సంక్షేమానికి రూ.488.62 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడి
Quick Summary:
మంత్రాలయం నియోజకవర్గంలో కూటమి

