నేటి సాక్షి 29 నంద్యాల జిల్లా:-
నేల తల్లికి, ఎడ్లకు, వ్యవసాయ పనిముట్లకు ప్రత్యేక పూజలు చేసి, విత్తనం గొర్రు పట్టి, స్వయంగా ట్రాక్టర్ నడిపి పొలం దున్ని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి సందడి చేశారు.
సోమవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి, రాష్ట్ర మంత్రి ఎన్ ఎం డి ఫరూక్, పాణ్యం ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గౌరు చరిత, నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, ఏ డి ఆర్ డాక్టర్. జయలక్ష్మి, నంద్యాల జిల్లా వ్యవసాయశాఖ అధికారి నున్నా. వెంకటేశ్వర్లు తదితరుల పాల్గొన్న ఏరువాక పౌర్ణమి సంబరాల్లో నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి విత్తనం గొర్రు పట్టి, స్వయంగా ట్రాక్టర్ తొలి సందడి చేశారు.
ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని మా మంచి ఉమ్మడి ప్రభుత్వం రైతు పక్షపాతి అన్నారు. రైతు సంతోషం, ఆనందంగా ఉంటేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. రైతే రాజు అని, దేశాభివృద్ధిలో రైతు కీలకమని నమ్మిన సీఎం చంద్రబాబు మొదటి ఏడాది అన్నదాత సుఖీభవ, పి ఎం కిసాన్ నిధులు అర్హులైన రైతులకు 20 వేలు జమచేసి, రెండవ ఏడాదికి కూడా ఇటీవలే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు రూ. 7 వేలు పెట్టుబడి నిధులు జమచేయడం సంతోషంగా ఉందని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
ఏరువాక పౌర్ణమి రైతుకు ఎంతో ముఖ్యమైన రోజు, నేల తల్లికి, కుటుంబ సభ్యులుగా భావించి (ఎడ్లు )పశువులకు, వ్యవసాయ పనిముట్లకు రైతు పూజ చేసి ఖరీఫ్ సీజన్ వ్యవసాయం మొదలు పెట్టడం, భూమిలో విత్తనాలు వేయడం మంచి రోజు, భారతీయ రైతు సాంప్రదాయం అన్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల నీటితో రాయలసీమలోని అన్ని చెరువులను నీటితో నింపి, కుప్పం చివరి ప్రాంతంకు సీఎం చంద్రబాబు సాగు నీరు తీసుకెళ్లి చరిత్ర సృష్టించారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఈ ఏడాది కూడా సకాలంలో వర్షాలు పడి రైతు పంట చేతికి వచ్చేలా ఆ దేవుళ్ళ దీవించాలని, రైతు సంతోషం మా ఉమ్మడి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. రైతుకు కష్టం రాకుండా చూసుకునే భాద్యత మా మంచి కూటమి ప్రభుత్వందే అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
Andhra
* ఎడ్లకు, వ్యవసాయ పనిముట్లకు, నెలా తల్లికి పూజ చేసి, విత్తనం గొర్రుపట్టి, ట్రాక్టర్ నడిపిన ఏరువాక పౌర్ణమిలో సందడి చేసిన నంద్యాల డాక్టర్ బైరెడ్డి శబరి. కలెక్టర్ రాజకుమారి గణియ.
Quick Summary:
ఎడ్లకు, వ్యవసాయ పనిముట్లకు, నెలా తల్లికి పూజ

