నేటి సాక్షి, ధర్మారం: గురుకుల పాఠశాలలపై విద్యార్థుల తల్లిదండ్రులకు రోజు రోజుకి నమ్మకం పెరుగుతుందని ఇందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యా వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులే ప్రధాన కారణం అని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గురుకుల పాఠశాలను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న అల్పాహారం, భోజనం మెనూ ఫై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో భాగంగా కిచెన్, డైనింగ్ హాల్ తో పాటు స్టోర్ రూమ్ ను మంత్రి పరిశీలించారు. మల్లాపూర్ గురుకుల పాఠశాలకు సరఫరా చేసిన సన్న బియ్యాన్ని మంత్రి పరిశీలించారు. బియ్యంలో నూకల శాతం ఎక్కువ ఉన్నందున బియ్యాన్ని వెనక్కి తీసుకొని సూపర్ ఫైన్ క్వాలిటీ బియ్యాన్ని పంపించాలని పెద్దపల్లి జిల్లా పౌరసరఫరాల అధికారికి మంత్రి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల గురుకుల పాఠశాలలో 27 లక్షల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ విద్యను అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులకు యూనిఫామ్స్ తో పాటు విద్యార్థులకు సంబంధించిన అన్ని రకాల వస్తువులను అందించడానికి చర్యలు తీసుకున్నారని వివరించారు. గురుకుల పాఠశాలలో మైనర్ రిపేర్ల కోసం రూ. 69 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
గురుకుల పాఠశాలలో పై తల్లిదండ్రులకు రోజు రోజుకి నమ్మకం పెరుగుతుంది అని ఎందుకు తగ్గట్టుగా విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందని అందించాలని ఈ సందర్భంగా మంత్రి గురుకుల పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. గురుకులాల్లో ఉండే విద్యార్థులను సొంత పిల్లల్లా చూసుకోవాలని అన్నారు. గురుకుల పాఠశాలను మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక నిధులు తీసుకువస్తానని మంత్రి పేర్కొన్నారు. ఈ పర్యటనలో మంత్రి వెంట ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రూప్ల నాయక్ తదితరులు ఉన్నారు.
Telangana
*గురుకుల పాఠశాలలపై పెరుగుతున్న నమ్మకం* *తల్లి దండ్రుల నమ్మకాన్ని ఉపాధ్యాయులు నిలబెట్టాలి* *మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు* *మల్లాపూర్ గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి అడ్లూరి*
Quick Summary:
తల్లి దండ్రుల నమ్మకాన్ని ఉపాధ్యాయులు నిలబెట్టాలి

