*నేటిసాక్షి హైదరాబాద్*
భట్రాజు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా మేడ్చల్ జిల్లా పశ్చిమ శాఖ అధ్యక్షుడు కూరపాటి కరుణాకర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవరాజు విష్ణువర్ధన్ రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రతికంఠం పూర్ణచందర్ రాజు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు ఏకగ్రీవంగా ఆమోదించడంతో కూరపాటి కరుణాకర్ రాజును రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించారు. ఈ సందర్భంగా కూరపాటి కరుణాకర్ రాజు మాట్లాడుతూ, గత మూడు దశాబ్దాలుగా భట్రాజు సంఘ అభ్యున్నతి కోసం తాను నిరంతరం సేవలందిస్తున్నానని, తన సేవలను గుర్తించి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవి తనపై మరింత బాధ్యతను పెంచిందని పేర్కొంటూ, భవిష్యత్తులో భట్రాజు కులస్తుల సంక్షేమం, అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. అలాగే తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు, సంఘ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
Telangana
*భట్రాజు సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులుగా కూరపాటి కరుణాకర్ రాజు నియామకం*:
Quick Summary:
అధ్యక్షులుగా కూరపాటి కరుణాకర్ రాజు నియామకం