నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి జూన్. 18
మండలంలోని పంచాయతీ కేంద్రం వెంగళపల్లి పాఠశాలకు చెందిన పిల్లలకు విద్య ఉపయోగ వస్తువులు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన నరసింహులు అతని కుమారుడు కుమారస్వామిల ఆధ్వర్యంలో ఎంఈఓ కేశవరెడ్డి పిల్లలకు నోటు పుస్తకాలు పెన్నులు పలు విద్యా ఉపయోగకర వస్తువులను పంపిణీ చేశారు ,అదేవిధంగా ఇటీవల జరిగిన 10 ఫలితాలలో 578 మార్కులు సాధించిన వెంగళపల్లికి చెందిన జోష్నకు 60 వేలు విలువచేయు ల్యాప్టాప్ ను బహుకరించారు ,ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులు పాఠశాలకు మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా వక్తలు అన్నారు ఇదే పాఠశాలలో 23 సంవత్సరములు పనిచేసే అందరిలోనూ మంచి పేరు తెచ్చుకున్న ఉపాధ్యాయుడు నాగరాజును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు లక్ష్మీ. నరసయ్య .నరసింహులు .ఓబులేసు .నాగేంద్ర. శ్రీనివాసులు. ఉపాధ్యాయులు గ్రామస్తులు పాల్గొన్నారు
Andhra
పిల్లలకు విద్యా ఉపయోగకర వస్తువులు పంపిణీ - పదిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి లాప్టాప్ పంపిణీ
Quick Summary:
పిల్లలకు విద్యా ఉపయోగకర వస్తువులు పంపిణీ