నేటి సాక్షి.శంకర్‌పల్లి: జూలై 4 ( సుధాకర్ గౌడ్):
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీగా నియమితులైన శంకర్‌పల్లి మాజీ ఎంపీటీసీ ఎండి జైనుల్లావుద్దీన్ (ఎజాస్) చేవెళ్ళ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పామెన భీమ్ భరత్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీజ్యోతి భీమ్ భరత్ లను శనివారం వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎజాస్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎజాస్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో పదవి కట్టబెట్టిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యుడు కృష్ణారెడ్డి, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Telangana
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీగా శంకర్‌పల్లి మాజీ ఎంపీటీసీ ఎండి జైనుల్లావుద్దీన్ (ఎజాస్)
Quick Summary:
శంకర్‌పల్లి మాజీ ఎంపీటీసీ ఎండి జైనుల్లావుద్దీన్
