నేటి సాక్షి న్యూస్ జూన్ 17
పెద్దకడబూరు ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా పెద్దకడబూరు గ్రామంలోని 204వ పోలింగ్ కేంద్ర పరిధిలో బుధవారం ఇంటింటా ఓటర్ల ధృవీకరణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని 1, 3 వార్డుల్లో ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ఓటర్ల నమోదు అధికారి లలిత ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్ బొగ్గుల నరసన్న, ప్రజా పంపిణీ దుకాణ నిర్వాహకుడు ఆశన్న, స్వామిదాస్ తదితరులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించారు. ఓటర్ల జాబితాలో పేర్లు సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశాలను పరిశీలించడంతో పాటు కొత్తగా అర్హత పొందిన వారి వివరాలను నమోదు చేశారు. అలాగే మరణించిన వారి పేర్లు ఒకే వ్యక్తి పేరు రెండుసార్లు నమోదైన సందర్భాలు, చిరునామా మార్పులు వంటి వివరాలను సేకరించి సంబంధిత అధికారులకు నివేదించేందుకు చర్యలు చేపట్టారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్ల జాబితాను పారదర్శకంగా, తప్పులులేకుండా రూపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలు సహకరించి సరైన సమాచారాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు పాల్గొన్నారు.
Andhra
హెడ్లైన్ : పెద్దకడబూరులో ఓటర్ల ధృవీకరణ ప్రక్రియ _ ఇంటింటా సర్వే నిర్వహించి వివరాల సేకరణ
Quick Summary:
హెడ్లైన్ : పెద్దకడబూరులో ఓటర్ల ధృవీకరణ ప్రక్రియ
