Telangana
**ప్రభుత్వ టీచర్ ను వేధించిన పోలీస్ కానిస్టేబుల్**
Quick Summary:
ప్రభుత్వ టీచర్ ను వేధించిన పోలీస్
నేటి సాక్షి: (శ్రీకాంత్ మాడుగుల) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ పోలీస్ స్టేషన్ లో కోర్టు ఆదేశాల మేరకు ఓ పోలీస్ కానిస్టేబుల్ పై కేసు నమోదైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు మహమ్మద్ స్టాలిన్ బేగ్ దాకాలు చేసిన ఫిర్యాదు పై నిందితుడిపై దూషించడం, బెదిరించడం, అనుమతి లేకుండా తన నివాస ప్రాంతాన్ని గుర్తించడం, మార్ఫింగ్ చేసిన చిత్రాలను ప్రచారం చేయడం వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో ముల్కనూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్. 98/2026 గా జూన్ 2న కేసు నమోదు చేసినారు, ఆయనపై బి ఎం ఎస్ సెక్షన్లు 115(2),125, 303, 351, 352. అలాగే ఐటీ చట్టం సెక్షన్ 66 కింద కేసు నమోదు చేసినట్టు ఎఫ్ ఐ ఆర్ లో పేర్కొన్నారు...
