నేటిసాక్షి, మిర్యాలగూడ : నిరుద్యోగ యువత పక్షాన పోరాడుతున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పై రాజస్థాన్ లోని జైపూర్ లో దాడి చేయడం హేయమైన చర్యని, ప్రజా సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ప్రజాసంఘల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పై జరిగిన దాడిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జన విజ్ఞాన వేదిక జాతీయ కన్వీనర్ డా. మువ్వరామారావు మాట్లాడుతూ, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ చేస్తున్న ఉద్యమం నిరుద్యోగ యువత కోసమేనని, ఎంతోమంది విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడి పరీక్షలకు సిద్ధం అవుతుంటే, కేంద్ర ప్రభుత్వం పట్టిపట్టనట్లుగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల నీట్ పరీక్ష లీకై అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైందని,
లీకులకు పాల్పడినవారి పై చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకుండా విద్యార్థుల పక్షాన పోరాడుతున్న అభిజిత్ దీప్కేపై దాడి చేయడం నిరుద్యోగ యువతను అవమానించినట్లేనని అన్నారు. అనంతరం విద్యావంతుల వేదిక నాయకులు హరికృష్ణ మాట్లాడుతూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులు అడిగే ప్రశ్న అన్నిటికి సమాధానాలు చెప్పాలని లేనిపక్షంలో, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రజా సంఘాల నాయకుడు బీసం రామయ్య మాట్లాడుతూ, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ విధానాలు ఇలాగే కొనసాగితే, ప్రతి పల్లెలో ప్రతి పట్టణాలలో ఉద్యమం మరింత తీవ్రమవుతుందని, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లెక్చరస్ ఫోరం నాయకులు సిహెచ్ యాదయ్య మాట్లాడుతూ, విద్యార్థి ఉద్యమాలను అనుచివేసే ప్రయత్నం కాకుండా విద్యార్థుల సమస్యలను పరిష్కరించే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉండాలని, తప్ప దాడి చేయడం ప్రజాస్వామ్యంలో సరైంది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు జే.కొండల్ రెడ్డి, కందుకూరి సుదర్శన్, విద్యావంతుల వేదిక నాయకులు డేగల వీటి, నారాయణ రెడ్డి, మౌసమ్ హుస్సేన్, సాగర్, మల్లేష్ యాదవ్, నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తే...దాడులు చేస్తారా...? -అభిజిత్ దీప్కే పై దాడి...హేయమైన చర్య -జనవిజ్ఞాన వేదిక జాతీయ కన్వీనర్: డా.మువ్వా రామారావు
Quick Summary:
నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తే...దాడులు చేస్తారా...?