నేటి సాక్షి చిలుకూరు
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామంలో
ప్రజాపాలన_ప్రగతిప్రణాళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం నందు స్థానిక ఎస్ఐ హనుమాన్ నాయక్ మాట్లాడుతూ. మన సమాజం నుండి డ్రగ్స్, గంజాయిని నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది అన్నారు, గంజాయి వియోగం వల్ల మన పిల్లలు, యువత అనారోగ్యాలకు గురైతున్నారు, దీని వల్ల బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు అన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో అందరూ భాగస్వామ్యమై పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి అన్నారు. పోలీసు నిత్యం తనిఖీలు నిర్వహిస్తుంది, గంజాయి అలవాటు, రవాణా పై నిఘా ఉంచాం.
అనంతరం స్థానిక ప్రజలతో డ్రగ్స్ నిర్మూలన ప్రతిజ్ఞ చేయించారు.
Telangana
**యువత డ్రగ్స్ కి దూరంగా ఉండాలి**
Quick Summary:
డ్రగ్స్ కి దూరంగా ఉండాలి..