*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, బీఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీ కేపీ వివేకానంద్ చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీ పత్రాలను సోమవారం చింతల్‌లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జీడిమెట్ల 132వ డివిజన్‌కు చెందిన 16 మంది లబ్ధిదారులకు 5,22500 విలువగల చెక్కులను బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వీరారెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ,
పేద ప్రజల ఆరోగ్య భద్రతే మా ప్రధాన లక్ష్యం. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలవడం మా బాధ్యత. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అనేక నిరుపేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ కేపీ వివేకానంద్ కు ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములై సేవ చేయడమే మా ధ్యేయం అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Telangana
*ఆరోగ్య భద్రతకు సీఎం రిలీఫ్ ఫండ్.* *-వీరారెడ్డి నరేందర్ రెడ్డి*
Quick Summary:
ఆరోగ్య భద్రతకు సీఎం రిలీఫ్ ఫండ్.