Telangana
*ఉచిత కుట్టు శిక్షణ కొరకు మహిళలు దరఖాస్తు చేసుకోండి:- ఎస్.జిలాని బి(ఉమెన్ ట్రస్ట్ అధ్యక్షురాలు), ఎస్.షర్పద్దీన్ అలి (సేవా భారతి వైఆర్డిఎస్ అధ్యక్షుడు)*.
Quick Summary:
*ఉచిత కుట్టు శిక్షణ కొరకు మహిళలు దరఖాస్తు
నేటి సాక్షి జూన్ 17 న్యూస్ పాములపాడు:-మండల కేంద్రమైన పాములపాడులో రోజ్ రూరల్ డెవలప్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ అధ్యక్షురాలు ఎస్.జిలాని బి ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న 45 రోజుల ఉచిత కుట్టు శిక్షణ కొరకు మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సేవా భారతి యూత్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు ఎస్.షర్పద్దీన్ అలి కోరారు. ఈ సందర్భంగా సేవా భారతి (వై ఆర్ డి ఎస్) అధ్యక్షుడు- ఎస్.షర్పద్దీన్ అలీ మాట్లాడుతూ కుల మతాలకతీతంగా 18 సంవత్సరాల పైబడిన మహిళలు ఆధార్ కార్డు జిరాక్స్, రెండు ఫోటోలు, వారు ఏమైనా చదువుకొని ఉంటే మార్క్ లిస్టు జిరాక్స్ కాపీ తో దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. వీరందరికీ పాములపాడులోని, కేజీ రోడ్డు ప్రక్కన ఉన్న సేవా భారతి (వై ఆర్ డి ఎస్) కార్యాలయంలో 45 రోజులపాటు మహిళ ఇన్స్పెక్టర్లతో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్స్ ప్రధానం చేయడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న మహిళలు కేవలం 500 రూపాయలు చెల్లించి, శిక్షణ పొంది సర్టిఫికెట్స్ పొందవచ్చును. కనుక మా కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఉమెన్ ట్రస్ట్ అధ్యక్షురాలు-9030379008 నెంబర్ కు గాని, సేవా భారతి అధ్యక్షుడు-9573318022 నెంబర్ కు గాని ఫోన్ చేసి కనుక్కోవచ్చునన్నారు.