నేటి సాక్షి - జగిత్యాల
(పూరెళ్ల బాపు )
.............................................
విధి నిర్వహణలో అప్రమత్తత, వేగవంతమైన స్పందన, మానవీయ దృక్పథంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన మల్యాల పోలీస్ స్టేషన్‌కు చెందిన బ్లూ కోల్ట్స్ కానిస్టేబుళ్లు మధుసూదన్ రెడ్డి మరియు వేణులను జిల్లా ఎస్పి అశోక్ కుమార్, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. వారి సేవలను గుర్తిస్తూ నగదు రివార్డును ప్రకటించారు.
*ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ*
ప్రజల ప్రాణాలను కాపాడడం పోలీసుల అత్యున్నత బాధ్యత అని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో స్పందించడం, మానవత్వంతో వ్యవహరించడం ప్రతి పోలీసు సిబ్బందికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. విధి నిర్వహణలో నిబద్ధత, సేవా భావంతో పనిచేసిన కానిస్టేబుళ్లు మధుసూదన్ రెడ్డి, వేణులను ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, ఇలాంటి సేవలు పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచుతాయని అన్నారు.నిన్న సాయంత్రం సుమారు 5.00 గంటల సమయంలో, మల్యాల మండలంలోని నూకపల్లి గ్రామ శివారులో రైల్వే ట్రాక్‌పై ఓ గుర్తుతెలియని వ్యక్తి గాయాలతో పడిఉన్నాడని డయల్-100 ద్వారా సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే బ్లూ కోల్ట్స్ సిబ్బంది కానిస్టేబుళ్లు మధుసూదన్ రెడ్డి మరియు వేణు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఒక వ్యక్తి మానసిక పరిస్థితి సరిగా లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు గుర్తించారు. తలకు తీవ్ర గాయమై రైల్వే ట్రాక్‌పైనే పడిఉండటంతో ప్రాణాపాయం ఉన్నట్లు గ్రహించిన పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అతడిని ట్రాక్‌పై నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం ప్రథమ చికిత్స అందించి, 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి గాయపడిన వ్యక్తిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టారు.
Telangana
*రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకొని వ్యక్తి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుళ్లు మధుసూదన్ రెడ్డి, వేణులకు జిల్లా ఎస్పీ ప్రశంసలు – నగదు రివార్డు* ---------------------------------------------
Quick Summary:
ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకొని వ్యక్తి ప్రాణాలను కాపాడిన కానిస్టేబుళ్లు

