నేటి సాక్షి 17 జూన్ న్యూస్ పాములపాడు:-2025–26 పదో తరగతి బ్యాచ్ నుంచి 9 మంది విద్యార్థులు ఐఐఐటి (ట్రిపుల్ ఐటీ)ల్లో పాములపాడు
ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ 2025–26 విద్యా సంవత్సరానికి చెందిన పదో తరగతి విద్యార్థులు మంచి ప్రతిభ చాటారని ప్రిన్సిపాల్ వి.నాగ రవీద్ర తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ వి.నాగ రవీంద్ర మాట్లాడుతూ మొత్తం 9 మంది విద్యార్థులు రాష్ట్రంలోని, వివిధ ఐఐఐటి క్యాంపస్‌లకు ఎంపికయ్యారు.
ఐఐఐటి నూజివీడులో
సి.హెచ్.ఎలిజబెత్ రాణి,
ఐఐఐటి ఇడుపులపాయలో ఆర్.మహాలక్ష్మి, పి.అక్సా రాణి, ఐఐఐటి ఒంగోలు లో సి.మేఘన, కె.జయశ్రీ, ఎం.జ్యోతిక, ఎం.మహేంద్ర, ఎం.శరణ్య, బి.వస్మిత భాయ్ లు ఎంపిక కావడం జరిగిందన్నారు.
విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారం వల్ల ఈ విజయాన్ని సాధించామని తెలిపారు. ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ, వారు ఉన్నత విద్యలో మరిన్ని విజయాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Andhra
*ఐఐఐటి లో పాములపాడు ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఘన విజయం:-వి.నాగ రవీంద్ర (ప్రిన్సిపాల్)*
Quick Summary:
*ఐఐఐటి లో పాములపాడు ఏపీ మోడల్ స్కూల్ & జూనియర్ కాలేజ్