నేటి సాక్షి - జగిత్యాల
(పూరెళ్ల బాపు )
........................................
జగిత్యాల జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామం లోని పీఏసీఎస్ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న ఎరువుల విక్రయ కేంద్రాన్ని కలెక్టర్ బి. సత్యప్రసాద్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా అప్ ద్వారా విక్రయాలను పరిశీలించారు.
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ*
రైతులకు కావలిసిన యూరియా నిల్వలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. అప్ ద్వారా యూరియా బుక్ చేసుకుని కొనుగోలు చేయాలని సూచించారు. సహకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన గోదాముల నిర్మాణానికి సంబంధించి పనులు తక్షణమే చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్ ను ఆదేశించారు.
జగిత్యాల రూరల్ మండలం జాబితాపూరు గ్రామంలో గోదాముల నిర్మాణానికి సంబంధించి ప్రదిపాదిత స్థలాన్ని పరిశీలించారు.జిల్లాలో పెరుగుతున్న పంటల దిగుబడికి అనుగుణంగా గోదాముల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాబార్డ్ సహకారంతో సహకార శాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదిత గోదాముల నిర్మాణం తో జాబితాపూరు ప్రాంతం జిల్లాలో ధాన్యం నిల్వ కేంద్రం గా మారుతుందని అన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గోదాముల నిర్మాణాన్ని పరిశీలించారు.
అదేవిధంగా అంతర్గాం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు.
ఈ పరిశీలనలో జిల్లా సహకార అధికారి చెరుకు మనోజ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి వి.భాస్కర్, ఏ డి ఏ నాయక్, రూరల్ తాశీల్దార్ హకీం మరియు తదితరులు ఉన్నారు.
Telangana
*ఎరువుల గోదాంలు విక్రయ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఐఏఎస్* ----------------------------------------
Quick Summary:
*ఎరువుల గోదాంలు విక్రయ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ