*నేటిసాక్షి కుత్బుల్లాపూర్*
సర్ కార్యక్రమంలో భాగంగా బూత్ నెం. 527లో ఫారమ్‌ల పంపిణీ
భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో బూత్ నెం. 527 పరిధిలో ఓటర్లకు ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీజేపీ శక్తి కేంద్రం ఇంచార్జ్ వేముల రమేష్ నాయకత్వం వహించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి నల్ల జై శంకర్ గౌడ్, జిల్లా కౌన్సిల్ మెంబర్ పులి బలరాం, బూత్ లెవల్ ఏజెంట్ భాగ్యలక్ష్మి, బీజేపీ సీనియర్ నాయకుడు మనీష్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఓటర్లందరూ ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం అవసరమైన ఫారమ్‌లను సక్రమంగా నింపి, సంబంధిత పత్రాలతో పాటు గడువులోగా బూత్ లెవల్ అధికారికి సమర్పించాలని కోరారు. కొత్త ఓటర్ల నమోదు, పేరు సవరణ, చిరునామా మార్పు లేదా ఇతర వివరాల సవరణ అవసరమైతే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
ప్రతి అర్హులైన పౌరుడు ఓటరు జాబితాలో తన పేరు నమోదై ఉండేలా చూసుకోవడం ప్రజాస్వామ్య బాధ్యత అని నాయకులు తెలిపారు.
Telangana
*527 బూతులో ఎస్ఐఆర్ పత్రాలు పంపిణీ*
Quick Summary:
సర్ కార్యక్రమంలో భాగంగా బూత్ నెం. 527లో ఫారమ్‌ల పంపిణీ