Telangana
*భారీ వర్షానికి గోడ కూలి గేదె మృతి* * చర్లపల్లిలో ఘటన.. ప్రభుత్వ పరిహారానికి విజ్ఞప్తి
Quick Summary:
*భారీ వర్షానికి గోడ కూలి గేదె మృతి*
*నేటి సాక్షి, ఎండపల్లి:* మండలంలోని చర్లపల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షం విషాదాన్ని మిగిల్చింది. గ్రామానికి చెందిన పడిదం వెంకటేష్ ఇంటి గోడ భారీ వర్షానికి తడిసి ఒక్కసారిగా కూలిపోవడంతో, సమీపంలో కట్టివేసిన అదే గ్రామానికి చెందిన అదే పోచయ్య పాడి గేదె గోడ కింద చిక్కుకుని మృతి చెందింది. ఈ ఘటనతో బాధిత పాడి రైతు కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. స్థానిక సర్పంచ్ పడిదం లావణ్య-మొగిలి సమాచారం మేరకు పశుసంవర్ధక, రెవెన్యూ శాఖల అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతి చెందిన పాడి గేదె విలువ సుమారు రూ.40 వేలుగా అంచనా వేసి, జరిగిన నష్టంపై నివేదిక సిద్ధం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పాత ఇళ్ల గోడలు, బలహీనమైన నిర్మాణాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.